అందమే ఆయుధం.. 11 మందిని పెళ్లి చేసుకుంది.. బాయ్‌ఫ్రెండ్స్‌ లెక్కేలేరు..

0
379

సోషల్ మీడియా, స్మార్ట్ ఫోన్ల ప్రభావంతో మోసాలు పెరిగిపోతున్నాయి. మానవీయ విలువలు మంటగలిసిపోతున్నాయి. దీని ఫలితంగా మనుషుల్ని మనుషులు మోసం చేసుకునే రోజులు గడుస్తున్నాయి. పురుషులకు మహిళలు ద్రోహం చేయడం, మహిళలపై పురుషులు అకృత్యాలకు పాల్పడటం వంటివి జరిగిపోతున్నాయి. తాజాగా ఓ మహిళ 11 మంది వ్యక్తులను పెళ్లి చేసుకుంది. ఇంకా ఆమెకు బాయ్‌ఫ్రెండ్స్ సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆమెకు చాలామంది బాయ్‌ఫ్రెండ్స్ వున్నారు.

వివరాల్లోకి వెళితే.. కేరళలోని కొచ్చి నగరానికి చెందిన లోరెన్ జస్టిన్ అనే వ్యక్తి తన భార్య మేఘా కనిపించట్లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మేఘా కనిపించకుండా పోయినప్పటి నుంచి ఇంట్లో ఉన్న రూ. 15 లక్షల డబ్బు, బంగారం కూడా మాయమైందని ఫిర్యాదు చేశాడు. ఇతడు చేసిన ఫిర్యాదుతో నిత్య పెళ్లి కూతురి వ్యవహారం బయటపడింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఈ క్రమంలో యూపీలోని నోయిడాలో పోలీసులకు చిక్కింది. ఆమె వద్ద జరిపిన విచారణలో ఆమె మాట్రీమోనీ ద్వారా పురుషులతో పరిచయం ఏర్పరుచుకుని 11 మందిని వివాహం చేసుకుందని తేలింది. తన అందంతో వారిని ఆకర్షించి.. మాయలో పడేసి.. పెళ్లి చేసుకునేది. పెళ్లైన కొద్దిరోజులు అణకువగా వున్నట్లు నటించేది. చివరికి దొరికినంత వరకు దోచుకునేది పారిపోయేది.

ఇలా ప్రాంతాలు మారుస్తూ.. ఒకరికి తెలియకుండా మరొకరికి మొత్తం 11 మందిని పెళ్లి చేసుకుంది మేఘా. ఒక్క కేరళ రాష్ట్రంలోనే నలుగురు యువకులు మేఘా మాయలో పడి మోసపోయారు. ఈమెకు ఆమె చెల్లి, బావ సపోర్ట్ కూడా ఉండడంతో పక్కా ప్లానింగ్‌తో ఛీటింగ్ స్కెచ్ గీసేవాళ్లు. పెళ్లికి ముందే కొందరిని ప్రేమ పేరుతో నమ్మించి, అందిన కాడికి దోచుకున్నట్టు తేలింది. ఈ కేసుపై పోలీసులు విచారణను ముమ్మరం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here