బ్రహ్మానందానికి అసలు ఏమైందో చెప్పేసిన కొడుకు….అరుదైన వ్యాధి?

0
800

ఎన్నో సినిమాల్లో తన హాస్యంతో కడుపుబ్బా నవ్వించిన ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం కు అనారోగ్యం కారణంగా ఇటీవల ముంబయిలోని ఏహెచ్ఐ (ఏషియన్‌ హార్ట్‌ ఇన్‌స్టిట్యూట్‌)లో శస్త్రచికిత్స చేసారని తెల్సి టాలీవుడ్ ఉలిక్కిపడింది. అందరిలో ముఖ్యంగా అయన సన్నిహితుల్లో కలకలం రేగింది. అసలు ఏమైంది, సడన్ గా ఇలా ఎందుకు అయింది అంటూ ఆరా తీయడం మొదలు పెట్టారు. ఫామిలీ డాక్టర్ సలహాతోనే ఆయన్ని తక్షణం ముంబయి కి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఆయన వెంట కుమారులు గౌతమ్,సిద్దార్ధ వున్నారు. ఏహెచ్ఐ వైద్యులు పరీక్షలు నిర్వహించి, గుండెకు శస్త్రచికిత్స చేయాలని, లేకుంటే ప్రమాదమని స్పష్టం చేసారు.

దీంతో బ్రహ్మానందం కుటుంబ సభ్యులు ఆపరేషన్ కి అంగీకారం తెలియజేస్తూ, డాక్యుమెంట్స్ పై సంతకాలు చేయడంతో ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన ప్రపంచ ప్రఖ్యాత వైద్యుడు రమాకాంత పాండా ఆధ్వర్యాన సోమవారం బ్రహ్మానందానికి శస్త్రచికిత్స నిర్వహించారు. శస్త్రచికిత్స నిర్వహించారు. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో కోలుకుంటున్నారు. అయితే బ్రహ్మానందానికి ఇలా సీరియస్ అవ్వడంపై ఫాన్స్ ఆందోళన వ్యక్తంచేస్తూ ఏమైందో అంటూ చర్చించు కుంటున్నారు. త్వరగా కోలుకోవాలని ఇండస్ట్రీ ప్రముఖులు ,ఫాన్స్ సందేశాలు పంపారు.

దీంతో బ్రహ్మానందం కొడుకు గౌతమ్ స్పందిస్తూ’కొన్ని నెలలుగా మా తండ్రికి గుండెకు సంబంధించిన ఇబ్బంది ఏర్పడింది. హైదరాబాద్ లోని వైద్యులకు చూపించినా ఫలితం లేకపోవడంతో పాటు ఆపరేషన్ అవసరం అని వైద్యులు చెప్పారు. అంతలోనే మరింత అస్వస్థత ఏర్పడింది. దీంతో ఏమాత్రం ఆలస్యం చేయకుండా ముంబయ్ తీసుకొచ్చి ఆపరేషన్ చేయించాం.

ఆపరేషన్ సక్సెస్ అయినట్లు డాక్టర్లు చెప్పారు. ప్రస్తుతం తండ్రి ఆరోగ్యం నిలకడగా ఉంది. ఛాతికి సంబంధించి అరుదైన వ్యాధి ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ప్రస్తుతం ఐసియు నుంచి జనరల్ వార్డుకి మార్చారు’అని వివరించాడు. మరికొన్ని రోజులు ముంబయిలోని ఉండి, ఫుల్ చెకప్ చేయించి హైదరాబాద్ తీసుకొస్తామని చెప్పాడు. తన తండ్రి కోలుకోవాలని సందేశం పంపినవారందిరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నామని చెప్పాడు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here