రేపు జనవరి 19 శని త్రయోదశి శని ప్రభావం ఉన్న వారు ఈ చిన్న పని చేస్తే దోషాలు,జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయి

0
198

రేపు జనవరి 19 న శనిత్రయోదశి. శనివారం త్రయోదశి తిధి వస్తే శని త్రయోదశి అని అంటారు. శని త్రయోదశి శివ కేశవులు ఇద్దరికీ ప్రీతిపాత్రమైనది. ఎలా అంటే శనివారం విష్ణు మూర్తికి ఇష్టమైన రోజు. త్రయోదశి శివునికి ఇష్టమైన తిది. అందువల్ల శనివారం త్రయోదశి వస్తే శివ కేశవులకు ప్రీతికరమని మన పెద్దలు చెప్పుతారు. అంతేకాక శని త్రయోదశి తిది నాడు జన్మించారు. అందువల్ల శని త్రయోదశికి అంత ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ శనిత్రయోదశి రోజున శనికి పూజలు,అభిషేకాలు చేస్తే శని దోషాలలో ముఖ్యమైనవి అయినా అష్టమి నాటి శని,ఏలినాటి శని నుండి బయట పడవచ్చు.

2019 సంవత్సరంలో శని గ్రహ ప్రభావం ఏ రాశులపై ఉంటుందో తెలుసుకుందాం. కన్య రాశివారికి అష్టమ స్థానంలోనూ, వృశ్చిక రాశివారికి అర్ధ అష్టమ స్థానంలోను, దనస్సు, మకర రాశివారికి ఏలినాటి శని స్థానంలో ఉంది. అందువల్ల ఈ రాశుల వారు రేపు శనివారం శనిత్రయోదశి రోజున ఉదయాన్నే లేచి తలస్నానము చేసి 6 నుంచి 7 గంటల మధ్యలో రుద్రాభిషేకం చేయిస్తే మంచిది.

సాయంత్రం 5.30 నుంచి 6.30 నిమిషాల మధ్య సమయంలో శివాలయంలో నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే మంచి ఫలితాలు కలుగుతాయి. 12 రాశుల్లో ఒక్కో రాశిలో శని రెండున్నర సంవత్సరాలు ఉంటాడు. ఇలా అన్ని రాశులను చుట్టి రావటానికి 30 సంవత్సరాల సమయం పడుతుంది. రాశులలో శని ఉండే స్థానం బట్టి ఫలితాలు మారుతూ ఉంటాయి. శని ఉండే స్థానంను బట్టి శని ప్రభావం ఎక్కువగాను, తక్కువగాను ఉంటుంది.

సూర్య భగవానునికి, ఛాయా దేవికి కలిగిన సంతానమే శనీశ్వరుడు. అందువల్ల శనీశ్వరుణ్ణి సూర్య పుత్రుడు,ఛాయా సుతుడు అని పిలుస్తారు. మన జాతక చక్రంలో శనీశ్వరుడు ఉంటే ఎంత భక్తి శ్రద్దలతో పూజిస్తే అంత శ్రద్దగా శాంతించి మనకు సుఖ సంతోషాలను కలిగిస్తాడు. శని త్రయోదశి రోజు శనిదేవుని ప్రసన్నం చేసుకోవటానికి శనీశ్వర మంత్రాన్ని 19 సార్లు పఠించాలి. ఈ మంత్రాన్ని పఠించటం వలన భక్తుల కష్ఠాలు తొలగిపోతాయి. మంచి జరుగుతుంది. శనిత్రయోదశి రోజున శనీశ్వరునికి నువ్వుల నూనెతో అభిషేకం చేసి చూసి చూడనట్టుగా పొమ్మని ప్రార్ధించాలి. శనీశ్వరుని వాహనం కాకి. శనీశ్వరునికి ఇష్టమైన రంగులు నలుపు,నీలం. శనీశ్వరుడు మంచి పనులను చేసే వారిని ఎప్పుడు బాధించడని పురాణాలూ చెపుతున్నాయి. వ్యక్తి చేసే కర్మలను అనుసరించి శనిదేవుని ప్రభావం ఉంటుంది. దశరధుడు,నల మహారాజు,ధర్మ రాజు,పరిక్షిత్ మహారాజు మొదలైనవారు కష్ట కాలంలో శనీశ్వరుణ్ణి పూజించి కష్టాల నుండి బయట పడ్డారు.

నువ్వుల నూనెతో శనికి అభిషేకం చేయడం,శనిత్రయోదశి రోజున ఉపవాసం ఉండడం,రావిచెట్టుకి ప్రదక్షిణాలు చేసి ఆవనూనె తో దీపం పెట్టడం,నువ్వుల నూనెలో ముఖం చూసుకొని ఆ నూనెని దానం చేయడం,నల్ల కాకికి అన్నం పెట్టడం,నల్ల కుక్కకి అన్నం పెట్టడం,నల్లని గొడుగు, నల్లని వస్త్రాలు, తోలు వస్తువులు, నవధాన్యాలు, ఇనుము దానం చేయడం.,వీలైనంతసేపు ఏపని చేస్తున్నా “ఓం నమ:శివాయ” అనే పంచాక్షరీ మంత్రాన్ని జపించటం.వికలాంగులకు ఆకలి గొన్న జీవులకు భోజనం పెట్టటం,ఎవరివద్ద నుండీ ఇనుము,ఉప్పు,నువ్వులు,నువ్వులనూనె చేతితో తీసుకోకుండా వుండటం చేయాలి,వీలైనవారు శివార్చన స్వయముగా చేస్తే చాలా మంచిది.శని అష్టోత్తర శతనామాలు, విష్ణు సహస్రనామస్తోత్రం, శివపురాణం, నలుని శని పీడించిన కథ పఠిస్తే మంచిది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here