ఎన్టీఆర్ కథానాయకుడు మూవీ రివ్యూ….హిట్టా….ఫట్టా… చూడండి

0
454

విశ్వవిఖ్యాత నట సార్యభౌమ నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర తెరపై ఆవిష్కరించడమంటే సాధారణ విషయం కాదు. ఆయన సినీ జీవితం ఒక మహావృక్షం. రాజకీయ జీవితం మరపురాని జ్ఞాపకం. ఎన్టీఆర్ తన జీవితంలో ఎంతో ఖ్యాతిని గడించారు. ఎన్నో అవరోధాలు ఎదుర్కొన్నారు. ఒకానొక దశలో నా అన్న వారే ఆయన్ని కాదనుకొని వెళ్లిపోయారు. వాస్తవానికి ఎన్టీఆర్ జీవిత చరిత్రలో ఎన్నో ఘట్టాలను ఒక్కో సినిమాగా తీయొచ్చు. అలాంటిది ఆయన సినీ, రాజకీయ జీవితాన్ని రెండు భాగాలుగా తెరకెక్కించే ధైర్యాన్ని నందమూరి బాలకృష్ణ చేశారు. ముందుగా ఆయన ధైర్యానికి మెచ్చుకోవాలి. తండ్రి జీవిత కథను తెరపై చూపించే మొదటి హక్కు తనకే ఉందని తెలుపుతూ ఆ మహా నటుడిగా కనిపించే సాహసాన్ని బాలయ్య చేశారు.

రాధాకృష్ణ జాగర్లమూడి(క్రిష్) దర్శకత్వంలో ఎన్టీఆర్ సినీ చరిత్ర ‘కథానాయకుడు’గా, రాజకీయ జీవితం ‘మహానాయకుడు’గా తెరకెక్కిన విషయం తెలిసిందే. సంక్రాంతి కానుకగా ‘యన్.టి.ఆర్ – కథానాయకుడు’ చిత్రాన్ని నేడు(జనవరి 9న) ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఎన్టీఆర్ గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్నవారు, ఎన్టీఆర్ గురించి అసలు ఏం చూపిస్తారని ఆలోచించేవారు ఈ సినిమా కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. మొత్తానికి ఈరోజు తెల్లవారుజామునుంచే ఆంధ్రప్రదేశ్‌లో షోలు మొదలైపోయాయి. అమెరికాలో సైతం ప్రీమియర్ షోలు పడిపోయాయి. బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోలు చూసిన ప్రేక్షకులు ట్విట్టర్ ద్వారా తమ స్పందనను వెల్లడిస్తున్నారు. అయితే ఈ స్పందన చూస్తుంటే ఏదో తేడాగా అనిపిస్తోంది.

కొంత మంది సినిమా బ్లాక్ బస్టర్, సంక్రాంతి బొమ్మ అంటుంటే.. మరికొందరు మాత్రం పెదవి విరుస్తున్నారు. ఫస్టాఫ్‌లో ఎన్టీఆర్ సినీ పాత్రలు మరీ ఎక్కువైపోయాయని అంటున్నారు. ఫస్టాఫ్‌ను మరీ సాగదీశారని, విసుగు తెప్పించారని కొందరి మాట. మనసుకు హత్తుకునే సన్నివేశం ఒకటీ లేదని అంటున్నారు. కానీ, సెకండాఫ్ మాత్రం అదిరిపోయిందట. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావడం, తెలుగు దేశం పార్టీని ప్రకటించడం వంటి ఎపిసోడ్స్ చాలా బాగున్నాయి అంటున్నారు. సెకండాఫ్‌లో వచ్చే ల్యాబ్ ప్రింట్ సీన్, దివిసీమ ఎపిసోడ్ సినిమాకే హైలైట్ అట.

ఇక సినిమాకు మరో బలం సాయి మాధవ్ బుర్ర డైలాగులు, కీరవాణి నేపథ్య సంగీతం అని చాలా మంది చెబుతున్నారు. 60 ఏళ్ల ఎన్టీఆర్‌గా బాలయ్య చాలా బాగున్నారు కానీ.. ఫస్టాఫ్‌లో యంగ్ ఎన్టీఆర్‌గా ఆయన మెప్పించలేకపోయారనేది చాలా మంది మాట. ఇక సినిమాలో బసవతారకమ్మగా విద్యా బాలన్ చాలా మంచి రోల్ చేశారు. బసవతారకమ్మగా విద్యా బాలన్ బాగా నటించారు. ఇక ఏయన్నార్ గా సుమంత్ అదరగొటాడని చెప్పాలి. కళ్యాణ్ రాం హరికృష్ణ పాత్రలో అలరించాడు. రానా నారా చంద్రబాబుగా అచ్చుగుద్దినట్టు కుదిరాడు. ఇక హీరోయిన్స్ గా శ్రీదేవి, జయసుధ, జయప్రదలుగా రకుల్, పాయల్, హాన్సిక అందరు అలా అలా కనిపించి అలరించారు. సావిత్రి పాత్రలో నిత్యా మీనన్ సర్ ప్రైజ్ చేసింది.

జ్ఞానశేఖర్ సినిమాటోగ్రఫీకి మంచి మార్కులు పడ్డాయి. సినిమాలో అన్ని గెటప్పులలో బాలకృష్ణని చాలా అందంగా చూపించారు. సినిమా మొత్తం అందంగా తీర్చిదిద్దడంతో డి.ఓ.పిగా జ్ఞానశేఖర్ తన బెస్ట్ అవుట్ పుట్ ఇచ్చారు. ఇక కీరవాణి మ్యూజిక్ కూడా సినిమాకు మరో బలమని చెప్పొచ్చు. ఆల్రెడీ ఆడియోలో హిట్ అయిన ఎన్.టి.ఆర్ కథానాయకుడు సాంగ్స్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా బాగున్నాయి. బిజిఎం కూడా అలరించింది. కథ కథనాల్లో దర్శకుడు క్రిష్ తన ప్రతిభ కనబరిచాడు. తెలిసిన కథను ఇంకాస్త డీటైల్డ్ గా తెలుగు ప్రజలకు ఆ మహనీయుడు జీవిత కథను అద్భుతంగా ఆవిష్కరించారు. నిర్మాతగా బాలకృష్ణ కూడా పర్ఫెక్ట్ అనిపించుకున్నారు. ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా సినిమాకు ఖర్చు పెట్టారని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here