14 మూవీస్ లో ఛాన్స్ కొట్టేసిన నూతన్ నాయుడు అసలు ఏంచేసాడో తెలుసా?

0
263

బుల్లితెర మీద అందునా రియాల్టీ షోల్లో కనిపిస్తే చాలు,ఇక వాళ్లకి వచ్చే పాపులారిటీయే వేరు. బిగ్ బాస్ షో లో కంటెస్టెంట్స్ కి సినిమాల్లో , టివి షోల్లో ఛాన్స్ లు తగ్గుతున్న సంగతి చూస్తున్నాం. ఇక బిగ్ బాస్ లో కనిపించిన నూతన్ నాయుడు ఏకంగా 14 సినిమాలు చేసేస్తున్నాడు. బిగ్ బాస్ రియాల్టీ షోలో తనదైన దూకుడు ప్రదర్శిస్తూ ఆడియన్స్ దృష్టిలో పడిన నూతన్ నాయుడు తొందరగానే ఎలిమినేట్ అయిపోయాడు.

అయితే హౌస్ లో ఉండగా కౌశల్ కి స్ట్రాంగ్ సఫోర్టర్ గా ఉండడంతో కౌశల్ ఆర్మీ మనసు గెలుచుకున్నాడు. అందుకే వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా మళ్ళీ ఎంట్రీ ఇచ్చినా ఎక్కువకాలం నిలబడలేకపోయాడు. బయటకు వచ్చాక నటన అంటే ఏమిటి తెలియని వాడు ఏకంగా విక్టరీ వెంకటేష్,వరుణ్ తేజ్ మల్టీస్టారర్ మూవీ ఎఫ్ -2లో నూతన్ ఛాన్స్ కొట్టేసాడు. పైగా ఇందులో కీలక పాత్ర దక్కిందట. ఇతడి నుంచి మంచి నటనను డైరెక్టర్ అనిల్ రావిపూడి రాబట్టాడట.

ఇక ఎఫ్ – 2ఇచ్చిన కిక్కుతో వరుసపెట్టి 14 సినిమాల్లో నటించడానికి ఒకే చెప్పేశాడట. ఇందులో కొన్ని సైన్ కూడా చేసాడట. రాజమౌళి డైరెక్షన్ లో వస్తున్న ఆర్ ఆర్ ఆర్ మూవీలో అలాగే మెగాస్టార్ చిరు కొత్త ప్రాజెక్ట్ సైరా లోనూ కూడా నూతన్ నటిస్తున్నాడు. అయితే తాను నటించే పాత్రలకు రెమ్యునరేషన్ వద్దని అంటున్నాడట. పేరు వస్తే డబ్బు కూడా వస్తుందని అంటున్నాడట.

షూటింగ్ ఎక్కడ జరిగిన సొంత ఖర్చులతో వెళ్తున్నాడట. బిగ్ బాస్ షోలో ఉండగానే సినిమాలు, రాజకీయాలు ఇష్టమని చెప్పిన నూతన్ ఇప్పుడు సినీ రంగంలో దూసుకెళ్తున్నాడు. ఇక రాజకీయాల్లో కూడా రాణిస్తాడేమో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here