పెళ్లి చేసుకోమంటూ కోర్టుకి వెళ్లనున్నపెళ్లి చూపులు విజేత – షాక్ లో ప్రదీప్

0
556

బుల్లితెరపై కొన్ని రియాల్టీ షోలు సంచలనం గా మిగిలితే ఒకటి రెండు షోలు మాయని మచ్చగా మారాయి. అందులో ప్రదీప్ పెళ్లిచూపులు షో ఒకటి. బిగ్ బాస్ సీజన్ టు ముగిశాక అదే స్థానంలో అట్టహాసంగా మొదలు పెట్టిన పెళ్లిచూపులు షో కి యాంకర్ సుమ హోస్ట్ గా వ్యవహరించింది. ఆడియన్స్ నుంచి కూడా వ్యతిరేకత మూటగట్టుకున్న ఈ షో అర్ధాంతరంగా ముగించారు. మొత్తానికి యాంకర్ ప్రదీప్ కెరీర్ లోనే కాదు,సుమ కెరీర్ లోనూ బ్యాడ్ తెచ్చిన షోగా మిగిలింది. కంటెస్టెంట్స్ లో విజేతను ప్రదీప్ పెళ్లిచేసుకుంటాడని మొదట్లో హింట్ ఇచ్చారు. అయితే ఇది రియాల్టీ షో మాత్రమేనని తేల్చేసారు.

ఈ షో గురించి ప్రకటించింది మొదలు వేలాది మంది అమ్మాయిలు ప్రదీప్ కోసం వెంపర్లాడారు. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి మొత్తం మూడు సార్లు ఒడబోతతో14మంది అమ్మాయిలను ఈ షోకి ఎంపిక చేసారు. ఎంపికైన 14మందిలో ఒకరిని విజేతగా నిల్పి , ప్రదీప్ పెళ్లి చేసుకుంటాడని టాక్ వినిపించింది. ఇండియాలో ఉన్నవాళ్లే కాదు,ఫారిన్ లో పనిచేసుకునే ఇద్దరు ముగ్గురు కూడా ఈ షోకి వచ్చారు. ఆడియన్స్ నుంచి,నెటిజన్ల నుంచి,జనం నుంచి వచ్చిన వ్యతిరేకతతో ముందుకు నడపలేక,వెనక్కి తగ్గలేక ఏదో షో అయిందనిపించి,ముగించారు.

అయితే ఈ షోలో వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా వచ్చిన జ్ఞానేశ్వరి విజేతగా నిలిచింది. షో లో ప్రదీప్ పట్ల చాలామంది కంటెస్టెంట్స్ చేసిన పనులు జుగుప్స కూడా కలిగించాయి.ఇక విజేతగా నిల్చిన జ్ఞానేశ్వరి చేసిన పనులు అన్నీ ఇన్నీ కావు. ఇక షో పూర్తయ్యాక ఇదంతా లైట్ గా తీసుకోమన్నట్లు ప్రదీప్ చెప్పేసాడు. ప్రదీప్ తో పెళ్లి అని చెప్పి నిర్వాహకులు తనను మోసం చేసారని, షోలో గెలిస్తేనే ప్రదీప్ పెళ్లిచేసుకుంటాడని చెప్పడం వలన తాను చాలా కష్టపడి షో గెలిచానని జ్ఞానేశ్వరి పేర్కొంటూ షో చివరిలో ప్రదీప్ గానీ, నిర్వాహకులు గానీ ఏ సమాధానం చెప్పకుండా ఊరుకున్నారని ఆమె ఆవేదన చెందింది.  ప్రదీప్ ని పెళ్లిచేసుకోమని ఆదేశించాలని జ్ఞానేశ్వరి కోర్టుకి వెళ్ళడానికి రెడీ అవుతోందట. కెరీర్ పీక్ స్టేజ్ లో ఉండగా, ఓ షో ద్వారా ఇలా దారుణమైన ఘటన ఎదుర్కోవాల్సి రావడంతో ప్రదీప్ తల్లడిల్లి పోతున్నాడట. ఎందుకంటే, నిజంగా ఆమె కోర్టుకి వెళ్తే,ప్రదీప్ కి ఇబ్బందే మరి. వెయిట్ అండ్ సీ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here