ఫ్రిజ్ లో ఇవి పెట్టుకుని తింటే ఖచ్చితంగా పోతారు..

0
490

ఈ రోజుల్లో ఫ్రిజ్ లేని ఇల్లు లేదు. మనం రోజూ ఫ్రిజ్‌లో అనేక పదార్థాలను నిల్వ ఉంచి ఆ తర్వాత వాడుకుంటూ ఉంటాం. అయితే అన్ని పదార్థాలను ఫ్రిజ్‌లో ఉంచకూడదు. క్యాన్సర్ కారక రసాయనాలు ఉద్భవించకుండా, ఆహార పదార్ధాలు విషతుల్యాలుగా మారకుండ మనం జాగ్రత్తలు తీసుకోవాలి.  ముందుగానే ఆహార పదార్థాలు సిద్ధం చేసుకుని చెడిపోకూడదని ఫ్రిడ్జ్ లో ఉంచుకుని మళ్ళీ వేడి చేసుకుని తినడం..మనకు చాల మాములు అయిపోయింది.. కానీ కొన్ని ఆహార పదార్థాలతో పాటు మరికొన్నింటిని ఫ్రిడ్జ్ లో అస్సలు ఉంచకూడదు. అవి ఏమిటో తెలుసుకోండి.

తులసి..తులసి మొక్క అంటేనే అతిపవిత్రంగా చూస్తాము.. అయితే కొందరు తులసి ఆకులను ఫ్రిడ్జ్ లో ఉంచుతుంటారు. ఇది కూడా సరైనది కాదు. అలాగే ఉంచడం వల్ల అవి నల్లగా మారుతాయి. అలాంటి ఆకులను మీరు వంటల్లో ఉపయోగిస్తే ఆహారం విషతుల్యం అవుతుంది. అందువల్ల తులసి ఆకులను ఎట్టి పరిస్థితుల్లో ఫ్రిడ్జ్ లో ఉంచకండి.

పండ్లు..అవోకాడో, ఆపిల్, అరటి, సిట్రస్ పండ్లు, బెర్రీలు, పీచెస్, ఆప్రికాట్లు వంటి పండ్లను రిఫ్రిజిరేటర్లో అస్సలు నిల్వ చేయరాదు. వాటిని ఫ్రిడ్జ్ లో పెడితే రుచులు మొత్తం మారిపోతాయి. ఒకవేళ మీరు కచ్చితంగా పండ్లను ఫ్రిడ్జ్ లో పెట్టాలనుకుంటే తినడానికి ముందు ఒక 30 నిముషాల పాటు ఉంచుకోవొచ్చు.

బ్రెడ్..బ్రెడ్ త్వరగా పాడైపోతుందని చాలామంది ఫ్రిజ్ లో పెడుతుంటారు… అయితే బ్రెడ్ ను అస్సలు ఫ్రిడ్జ్ లో పెట్టకూడదు. దాంతో అది డ్రైగా మారుతుంది. వీలైనంత వరకు బెడ్ర్ ను రూమ్ టెంపరేంచర్ అనుకూలంగా ఏదైనా బాక్స్ లో స్టోర్ చేసుకోవడం మంచిది. మీరు బ్రెడ్ ను ఫ్రిడ్జ్ లో కొన్ని రోజుల పాటు నిల్వ ఉంచితే అది బూజు పట్టే అవకాశం కూడా ఉంది.

ఉల్లిపాయలు..శరీర ఆరోగ్య శుద్ధీకరణలో ఉల్లిపాయ ఎంతో ఉపయోగపడుతుంది.. ఉల్లిపాయలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఫ్రిడ్జ్ లో ఉంచకూడదు. అలాగే ఉల్లిపాయలను బంగాళాదుంపలను కలిపి కూడా ఒకే చోట నిల్వ చేయరాదు. అలా ఉంచితే ఉల్లిపాయలు పాడు అవుతాయి. అలాగే మీరు ఫ్రిడ్జ్ లో ఉల్లిపాయలను ఉంచి వాటిని తింటే రోగాల బారిన పడాల్సి వస్తుంది. తరిగిన ఉల్లిపాయ ముక్కలు లేదా ఉల్లిపాయలను కవర్ లో ఉంచి ఫ్రిడ్జ్ లో పెట్టినా సరే ఉల్లిపాయల నుండి వాసన వస్తూ ఉంటుంది. వీటి వాసన ఇతర ఆహారాలకు కూడా వస్తుంది కాబట్టి ఫ్రిడ్జ్ లో ఉంచకపోవడం బెటర్. అందువల్ల వీటిని పేపర్ బ్యాగ్ లో ఉంచడం మంచిది.

బంగాళాదుంపలు (ఆలుగడ్డలు)..ఆలుగడ్డలను ఎట్టి పరిస్థితుల్లోనూ చల్లటి వాతావరణంలో ఉంచకూడదు. ఫ్రిడ్జ్ లో బంగాళాదుంపలు ఉంచి వాటిని తింటే ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. ఫ్రిడ్జ్ లో ఉండే చల్లని ఉష్ణోగ్రతల కారణంగా బంగాళాదుంపలలో చక్కర శాతం త్వరగా పెరిగే అవకాశం ఉంది. నీటితో శుభ్రం చేయకుండా ఎలా ఉన్నవాటిని అలా మీ వంట రూమ్ లోని కప్ బోర్డ్ లో ఉంచుకోవచ్చు. అలాగే వీటిని పేపర్ బ్యాగ్ లో ఉంచడం మంచిది.

 

టమాటా..ప్రకృతి అందిందే వరప్రదాయిణిలో టమాటా ఒకటి.. మార్కెట్ నుండి తీసుకువచ్చిన టమోటోలను రిఫ్రిజిరేటర్ లో ఉంచడం వలన చల్లటి ఉష్ణోగ్రతల కారణంగా త్వరగా పండిపోయే అవకాశం ఉంది. టమాటాలను ఫ్రిడ్జ్ లో ఉంచితే వాటి అసలు రుచి పోతుంది. అందువల్ల వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఫ్రిడ్జ్ లో ఉంచకూడదు. వీలైనంత వరకు ఇంట్లో బాగా గాలి తగిలే ప్రదేశంలో టమాటాలను బయట ఉంచడమే బెస్ట్.

నూనె..చాలామంది నూనెను కూడా ఫ్రిడ్జ్ లో ఉంచుతుంటారు. ఇది కూడా అంత మంచిదికాదు. మీ ఇంట్లో ఉండే ఉష్ణోగ్రత అనుకూలంగా నూనెను నిల్వ చేయడం మంచిది. వెల్లుల్లి..కొందరు వెల్లుల్లిని ఫ్రిడ్జ్ లో నిల్వ ఉంచుతుంటారు. ఇలా నిల్వ ఉంచిన వెల్లుల్లిని తింటే మీరు అనారోగ్యాల బారిన పడాల్సి వస్తుంది. మన శరీర రోగనిరోధక శక్తిని పెంచే వెల్లుల్లిని ఫ్రిడ్జ్ లో ఉంచడం వలన దీనిని ఆహారంలో వాడినా ఫలితం ఉండదు. ఎందుకంటే చల్లటి ఉష్ణోగ్రతల కారణంగా ఇందులో ఉండే రుచి మరియు సువాసన మిస్ అవుతుంది మరియు ఫ్రిడ్జ్ లో ఉంచడం వలన కుళ్లిపోయే అవకాశం కూడా కలదు. అందువల్ల మీరూ ఇప్పటి నుంచైనా వెల్లుల్లిని ఫ్రిడ్జ్ లో నిల్వ ఉంచకుండా ఉండడానికి ప్రయత్నించండి.

కాఫీ..కాఫీని ఎట్టి పరిస్థితుల్లోనూ రిఫ్రిజిరేటర్ లో ఉంచకండి. కాఫీ ఫ్రిడ్జ్ లో ఉంచితే దాని రుచి పోతుంది. అలాంటి కాఫీని తాగడం ఆరోగ్యానికి కూడా మంచిది కాదు. అందువల్ల మీరు కాఫీని ఫ్రిడ్జ్ లో కాకుండా బయటనే ఉంచండి. చెట్నీలు, ఊరగాయలు, పచ్చళ్లు.. చాలామంది చెట్నీలు, పచ్చళ్లను కూడా ఫ్రిడ్జ్ లో ఉంచుతారు. ఇది కూడా మంచిది కాదు. అలా ఫ్రిడ్జ్ లో ఉంచిన పచ్చళ్లను తింటే చాలా రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సూర్యకాంతి పడకుండా ఊరగాయ, ఆవకాయలను ఇంట్లో ఉంచడం వలన రెండు మూడేళ్ళ పాటు పాడవ్వకుండా ఉంటాయి. అలాగే ఫ్రిడ్జ్ లో ఉంచడం వలన రుచి పోతుంది మరియు చల్లటి ఉష్ణోగ్రతలకు పాడవుతాయి.అందువల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ వీటిని ఫ్రిడ్జ్ లో ఉంచకండి.

పుచ్చకాయ (కళింగర పండు)..పుచ్చకాయ అనేక రోగాలకు దివ్యౌషధంగా పనిచేస్తుంది. కిడ్నీసంబంధిత వ్యాధులను పుచ్చకాయ నయం చేస్తుంది.. పుచ్చకాయను కూడా ఫ్రిడ్జ్ లో ఉంచకూడదు. కొంతమంది ఈ పండును కొద్దిగా తిని మిగతా భాగాన్ని ఫ్రిడ్జ్ లో ఉంచుకుని తర్వాత తింటూ ఉంటారు. ఇలా చేయడం మంచి పద్ధతి కాదు. దీంతో మీరు అనారోగ్యాల బారిన పడతారు. ఇప్పటి నుంచి ఎప్పుడైనా పుచ్చకాయ ఇంటికి తెచ్చుకుంటే దాన్ని ఫ్రిడ్జ్ లో పెట్టకూడదనే విషయాన్ని మరిచిపోకండి. తెలిసిందిగా ఈ 11 రకాల పదార్థాలను ఫ్రిజ్ లో పెట్టుకుని తింటే కచ్చితంగా మీరు ఆసుపత్రికి పోతారు… అందుకే ఇప్పటి నుంచైనా మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here